చంద్రబాబు బీసీల అభివృద్ధికి అడ్డుపడ్డారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్... బీసీలకు 34 శాతం రిజర్వేషన్ను ప్రకటించాకే.... చంద్రబాబు కూడా ప్రకటించారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..... ప్రజల కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని పేర్ని నాని ప్రశ్నించారు. ప్రశ్నించడమే తన మేనిఫెస్టో అని చెప్పుకునే పవన్... గతంలో ఎప్పుడూ చంద్రబాబును, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. జగన్ బ్రహ్మాండంగా పరిపాలిస్తే పవన్ సినిమాలు చేసుకుంటానని గతంలో చెప్పారని.. చెప్పినట్టే సినిమాలు చేసుకుంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: