ETV Bharat / city

Pawan: విద్యాలయాల నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడం దురదృష్టకరం: పవన్‌ - జనసేన అధినేత పవన్ తాజా వార్తలు

విద్యాలయాల నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ (Pawan On NTR Health University Funds) అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాలని విద్యావేత్తలు, వైద్య నిపుణులకు ఆయన సూచించారు.

విద్యాలయాల నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడం దురదృష్టకరం

author img

By

Published : Nov 14, 2021, 5:40 PM IST

విశ్వ విద్యాలయాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం...ఆ విద్యాలయాల నిధులను మళ్లించుకోవడం దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తలమానికమైన ఎన్టీఆర్​ హెల్త్ యూనివర్శిటీ (Pawan On NTR Health University Funds) నుంచి ప్రభుత్వ అవసరాలకు నిధులు తీసుకోవడానికి...విశ్వ విద్యాలయం పాలక మండలిపై ఒత్తిళ్లు తీసుకురావటం మానుకోవాలని సూచించారు. వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపరచేందుకు మరిన్ని నిధులు సమకూర్చాల్సిన పాలకులు.. విద్యాలయం నిధులనే తీసుకోవాలనుకోవడాన్ని విద్యావేత్తలు, వైద్య నిపుణులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

విద్యాలయాల నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడం దురదృష్టకరం
విద్యాలయాల నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడం దురదృష్టకరం

నిధులు మళ్లించాలని కీలక బాధ్యతల్లో ఉన్నవారే ప్రయత్నించడంతోనే అత్యవసరంగా పాలకమండలి సమావేశం అయినట్లు తన దృష్టికి వచ్చిందన్న పవన్...,250 కోట్ల కోసం ప్రభుత్వం ఎందుకింత ఆత్రపడుతోందని ప్రశ్నించారు. ఈ సొమ్ములను ఏ ప్రయోజనం కోసం ఖర్చు చేస్తారో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలకు ఉన్న నిధులు, వాటి నిర్వహణపై జనసేన పార్టీ పరిశీలన చేస్తుందని పవన్ హెచ్చరించారు.

ఇదీ చదవండి: Pawan on Aided Schools: ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.