ETV Bharat / city

వైద్య సిబ్బందికి తగిన భరోసా ఇవ్వాలి: పవన్‌

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పని చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి మన దేశానిదన్నారు.

వైద్య సిబ్బందికి తగిన భరోసా ఇవ్వాలి:పవన్‌

author img

By

Published : Apr 8, 2020, 12:41 PM IST

మానవతామూర్తులైన ఎందరో వైద్యులు తమ వృత్తి ధర్మంతో పేదలకు ఎనలేని సేవలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. తమకీ, తమ కుటుంబానికీ వైరస్ ముప్పు ఉంటుందని తెలిసీ రోగులకు సేవలు చేస్తున్నవారిని ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 విధుల్లో ఉన్నవారందరికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా పీపీఈలు సమకూర్చాలి. రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంతో పాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలని పవన్‌ కోరారు.

ఇదీ చూడండి

ఫ్రాన్స్​లో కరోనా కల్లోలం-10 వేలు దాటిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.