ETV Bharat / city

'సన్ రైజ్ స్టేట్ కాస్తా సన్​సెట్ రాష్ట్రంగా మారిపోయింది' - 'సన్ రైజ్ స్టేట్ కాస్తా సన్​సెట్ రాష్ట్రంగా మారిపోయింది'

వైకాపా ఏడాది పాలనలో సన్ రైజ్ స్టేట్ కాస్తా సన్​సెట్ రాష్ట్రంగా మారిపోయిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విమర్శించారు. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. బినామీలకు కట్టబెట్టేందుకు సోల్డ్ ఏపీ చేస్తున్నారని మండిపడ్డారు.

'సన్ రైజ్ స్టేట్ కాస్తా సన్​సెట్ రాష్ట్రంగా మారిపోయింది'

author img

By

Published : May 26, 2020, 6:54 AM IST

వైకాపా ప్రభుత్వం ఏడాదిలో అద్భుతాలు సృష్టించినట్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. సన్ రైజ్ స్టేట్ కాస్తా సన్​సెట్ రాష్ట్రంగా మారిపోయిందని విమర్శించారు. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పడం జగన్​కు అలవాటైందని విమర్శించారు. మేనిఫెస్టోను కూడా పవిత్రగ్రంధాలతో పోల్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగితే 4 లక్షల 92 వేల 977 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు డ్వాక్రాకు చేయూతనందిస్తే నేడు జగన్ వారిని మోసం చేశారని విమర్శించారు. వైఎస్ఆర్ ఆసరా కింద నాలుగు దఫాలలో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసి 27వేల కోట్ల డ్వాక్రా రుణమాఫీని ఎగ్గొట్టారని ఆరోపించారు.

ఇసుక, సిమెంట్ కంపెనీల వద్ద జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. బినామీలకు కట్టబెట్టేందుకు సోల్డ్ ఏపీ చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులకు కక్కుర్తిపడి ఎల్టీ పాలిమర్స్ కంపెనీపై చర్యలు తీసుకోలేదని.., కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.