ETV Bharat / city

'28 మంది వైకాపా ఎంపీలు బడ్జెట్​లో రాష్ట్రానికి ఏం సాధించారు' - పట్టాభి తాజా వార్తలు

28 మంది వైకాపా ఎంపీలు కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు. బడ్జెట్​ కేటాయింపులు సాధించటంలో విఫలమైన ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల కోసం జగన్‌ రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.

దేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

author img

By

Published : Feb 1, 2021, 7:11 PM IST

రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులు సాధించటంలో విఫలమైన 28 మంది వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. వైకాపా ఎంపీలు రాష్ట్రానికి బడ్జెట్​లో ఏం సాధించారని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క అంశాన్నైనా వైకాపా ఎంపీలు ప్రస్తావించారా? అని నిలదీశారు. కేంద్ర ఆర్థిక మంత్రికి, రాష్ట్ర ఆర్ధిక మంత్రి శాలువాలు కప్పి, తిరుపతి లడ్డూలిచ్చి ఏం తీసుకొచ్చారన్నారు.

విశాఖకు రైల్వే జోన్ సాధించలేని వారు విశాఖను రాజధాని చేస్తామంటే ఎవరు నమ్ముతారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాలకు బడ్జెట్​లో నిధులు కేటాయిస్తే..ఏపీ సీఎం, వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్..బడ్జెట్​లో సీమకు ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. తనపై ఉన్న సీబీఐ,ఈడీ కేసుల కోసం జగన్‌ రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఇదీచదవండి: పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.