కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఆర్టీసీ బస్సు టైరు పేలిపోయింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు టైరు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక్కసారిగా పంక్చర్ అయ్యింది.
ఇద్దరికి తీవ్రగాయాలు కాగా... మరికొంత మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 28 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: