ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారన్నారు.
ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసును సీఐడీకి అప్పగించారు. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ఆదేశించారు.
ఇదీ చదవండి:
pulichinthala project: ప్రభుత్వ విప్‌ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు