పట్టణ ప్రజలపై అదనంగా పన్నుల భారం మోపడాన్ని నిరసిస్తూ.. విపక్షాలు విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విపక్షాల నిరసనల మధ్యే నగరపాలక కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మొదలైంది. సమావేశానికి ముందు.. కార్యాలయ గేటు ముందు తెలుగుదేశం, వామపక్షాలు, పౌరసంఘాలు నిరసన తెలిపాయి. ఆస్తి పన్నుపెంపును ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. చెత్త, డ్రైనేజీ, నీటి పన్నుల పెంపు ఉత్తర్వుల రద్దుకు పట్టుపట్టాయి. కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి యత్నించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ క్రమంలో తోపులాట చోటుచేసుకుని పలువురి గాయాలయ్యాయి.
ఇదీ చదవండి: