ETV Bharat / city

NTR WEBSITE: ఎన్టీఆర్‌పై వెబ్‌సైట్‌ ప్రారంభించిన చంద్రబాబు - ఎన్టీఆర్ వెబ్​సైట్ వార్తలు

NTR WEBSITE: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని.. ఆయన పేరుతో శత జయంతి ఉత్సవ సంఘం ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ ఎన్టీఆర్‌ డాట్‌ కాం’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. దాన్ని తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు.

NTR WEBSITE was launched by chandrababu
ఎన్టీఆర్‌పై వెబ్‌సైట్‌ ప్రారంభించిన చంద్రబాబు
author img

By

Published : Jun 30, 2022, 7:15 AM IST

NTR WEBSITE: మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో శత జయంతి ఉత్సవ సంఘం ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ ఎన్టీఆర్‌ డాట్‌ కాం’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది. దాన్ని తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ఈ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల నుంచి డిజిటల్‌ సంతకాలను సేకరిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ పేరు మీద ఓ సంఘాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించి..ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు సంఘ సభ్యులను అభినందించారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌ తరాలపాటు జనం గుండెల్లో నిలిచిపోయే మహానుభావుడని.. చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కనపర్తి రవిప్రసాద్‌, కార్యదర్శి తుమ్మల రమేష్‌, సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.