నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ భవన్‌లో నోముల భగత్‌కు పార్టీ బి-ఫారంను కేసీఆర్ అందజేశారు. భగత్ రేపు ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్‌ను నోముల భగత్‌కు పార్టీ అధినేత కేసీఆర్ అందించారు.
ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురవయ్యయాదవ్, రంజిత్‌యాదవ్, బాలరాజ్‌యాదవ్ తదితరులు కూడా టికెట్ ఆశించారు. వీరందరి పేర్లను పరిశీలించి, సర్వేలు చేయించి... ఎట్టకేలకు టికెట్‌ను భగత్‌కుమార్‌కు ఇచ్చారు. పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: