డాక్టర్ అనితారాణి మానసిక పరిస్థితి బాగా లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. వైద్యురాలి వ్యవహారంలో జరిగిన వాస్తవాలు బయటపెట్టేందుకు సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు.
వైకాపా ఏడాది పాలనలో అన్ని ధరల పెంపుతో ప్రజలపై 50 వేల కోట్ల భారం వేశారని ఆరోపించారు. లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలను పీడిస్తున్నారని నిమ్మల విమర్శించారు.
ఇదీ చదవండి: సుప్రీంలో ఎల్జీ పాలిమర్స్ కేసు: విచారణ వాయిదా