విశాఖ తూర్పు నౌకాదళంలో గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన ఐఎస్ఐ ఉగ్రవాది ఇమ్రాన్ యాకుబ్ గితెలిపై జాతీయ దర్యాప్తు సంస్థ అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది. విజయవాడ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 120 బి, 201 ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. గూఢచర్యం కోసం భారత్‌లో నిధులు వసూలు చేసి ఇతర నిందితులకు ఇచ్చినట్లు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన ఇతర ఉగ్రవాదులతో కలిసి నౌకాదళ రహస్యాలను రాబట్టేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. నౌకాదళంలోని ఉద్యోగులకు మరి కొందరు నిందితులకు గూఢచర్యం కోసం డబ్బు ఇచ్చినట్లు ఎన్ఐఏ అభియోగం నమోదు చేసింది.
ఇదీచదవండి