ETV Bharat / city

కృష్ణమ్మకు పునర్వైభవం తీసుకొచ్చేలా.. 'నేను సైతం' - river clean

దశాబ్దాలుగా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురై.. అస్తిత్వం కోల్పోయే స్థితికి చేరుకున్న కృష్ణా నదికి... పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృష్ణా జిల్లా అధికారులు ముందడుగేశారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, విద్యార్థుల సహకారంతో ప్రక్షాళన చేపట్టారు. కృష్ణమ్మ శుద్ధి సేవలో నేను సైతం అనే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కృష్ణమ్మకు పునర్వైభవం తీసుకొచ్చేలా...'నేనుసైతం'
author img

By

Published : May 2, 2019, 3:16 PM IST

కృష్ణమ్మకు పునర్వైభవం తీసుకొచ్చేలా...'నేనుసైతం'

కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగు, తాగునీరు... పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీటికి కృష్ణా నది ప్రధాన వనరు. గలగల పారే కృష్ణమ్మ నేడు మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కళావిహీనంగా మారింది. ప్రజల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేని తనం వెరసి కాలుష్యకాసారంగా మారింది. విజయవాడ నుంచి వచ్చే వ్యర్థాలు, ప్లాస్టిక్, చెత్త పోగై సాగునీటి కాలువలు మురికి కూపాలుగా తయారయ్యాయి.
నదీ ప్రక్షాళన చేయకుంటే ప్రమాదమని గ్రహించిన కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం... 'నేను సైతం.. కృష్ణమ్మ శుద్ధి సేవ'లో అనే నినాదాన్ని తీసుకొచ్చింది. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, ప్రజల భాగస్వామ్యంతో పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళిక రచించింది. ప్రతి నెలా 2రోజల పాటు కృష్ణా నదిని ప్రక్షాళన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
దీనిలో భాగంగా 'కృష్ణమ్మ శుద్ధి సేవలో నేను సైతం' అనే కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. కాలువగట్లు, నదీ పరీవాహక ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను కాలువలు, నదిలో వేయకుండా తడి-పొడి చెత్తను వేరుచేసి నగర పాలక సంస్థ సిబ్బందికి అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
దాదాపు 200 ప్రొక్లెయిన్లు, 100 ట్రాక్టర్లతో కృష్ణా నదితో పాటు ప్రధాన కాలువల ప్రక్షాళన చేపట్టారు. నగరంలోని 15 ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసి బిరాబిరా పరుగులిడే కృష్ణమ్మకు పునర్వైభవం తీసుకువస్తామంటున్నారు అధికారులు.

ఇదీ చదవండి

'కృష్ణమ్మ శుద్ధి సేవలో నేను సైతం'

Intro:కిట్ నం: 879, విశాఖ సిటీ‌‌, ఎం.డి.అబ్దుల్లా.

ప్రపంచవ్యాప్తంగా 80వ దశకంలో బాలల హక్కుల గురించి వివిధ దేశాలలోని ప్రభుత్వాలు చట్టాలు చేయడం ప్రారంభించాయని, బాలల హక్కులను ఐక్యరాజ్యసమితి గుర్తించిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని బాలవికాస్ ఫౌండేషన్ అధ్యక్షుడు నరవ ప్రకాశరావు అన్నారు. పోలీస్ పబ్లిక్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ (పాపా హోం ) లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కార్యక్రమానికి అతిథిగా హాజరైన నరవ ప్రకాశరావు దేశంలో అనేక బాలల చట్టాలు అమలు అవుతున్నప్పటికీ వారు ఇంకా నిరాదరణకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

Body:ఈ సందర్భంగా బాలల మనోవికాసానికి ఉపయోగకరమైన యోగా, హిందీ తదితర అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు పాపా హోం కార్యదర్శి పి వెంకటేశ్వరరావు అన్నారు.

Conclusion:కార్యక్రమంలో పాపా హోమ్ ఉపాధ్యక్షుడు డి సూర్యప్రకాశరావు ,పోలీస్ వెల్ఫేర్ ఆర్ ఐ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

బైట్ : నరవ ప్రకాశరావు, అధ్యక్షుడు, బాల వికాస్ ఫౌండేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.