తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రను అ.ని.శా. అధికారులు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. కరోనాతో విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో ధూళిపాళ్లకు చికిత్స అందించారు. మరోసారి నిర్వహించిన నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్ రావడంతో రాజమహేంద్రవరం తీసుకెళ్లారు. ధూళిపాళ్ల వారంపాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కారాగారంలోనే ఐసోలేషన్‌లో ఉంచుతామని అ.ని.శా. అధికారులు తెలిపారు.
కస్టడీని రీకాల్ చేయాలని...
ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు... నరేంద్ర కస్టడీని రీకాల్ చేయాలని అ.ని.శా. కోర్టులో ధూళిపాళ్ల తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి:
రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఏపీ నుంచి వెళ్లే వాహనాలు నిలిపివేత..