ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్‌కు రమ్మని హడావుడి చేశారని నారా లోకేశ్ వెల్లడించారు. దీపక్ రెడ్డి హైదరాబాద్‌లో రెండుసార్లు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకుంటే రెండుచోట్ల నెగటివ్ వచ్చిందని.. తన ట్విట్టర్లో పోస్ట్ చేశారని లోకేశ్ అన్నారు.
ఎమ్మెల్సీ విషయంలోనే ఇలా ఆటలాడితే, ప్రజలతో ఇంకెన్ని ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పరీక్షల్లో ఏమిటీ నిర్లక్ష్యమని నిలదీశారు. జగన్ పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్ట్‌లను ఆషామాషీగా చేస్తుందా? అని సందేహం వస్తుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. పాజిటివ్ అని నిర్ధరణ చేసుకోకుండా తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని క్వారంటైన్లో పెట్టడానికి చేసిన హడావుడి చూస్తే... ప్రభుత్వం ఇంకెదైనా కుట్ర చేసిందా? అని అనుమానాలు వస్తున్నాయని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. వైకాపా షోకాజ్ నోటీసు