ETV Bharat / city

సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు - నాంపల్లి డ్రగ్స్ కేసు వార్తలు

సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసును విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు

author img

By

Published : Jul 1, 2021, 6:20 PM IST

Updated : Jul 1, 2021, 7:41 PM IST

18:18 July 01

సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసు (Drugs Case)ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్‌ సిట్‌ సమర్పించిన అభియోగపత్రాలను న్యాయస్థానం ఆమోదించింది. 4 సంవత్సరాల తర్వాత ఈ కేసులో విచారణ మొదలుకానుంది.

కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన ఆబ్కారీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం.. అభియోగపత్రాలను కోర్టులో దాఖలు చేసింది. వాటిని న్యాయస్థానం ఆమోదించింది. కరోనా కారణంగా న్యాయవిచారణలో జాప్యం జరగడం వల్ల కేసు ఇన్నాళ్లు వాయిదాపడింది. 2017 జులై 2న ఎక్సైజ్‌ శాఖ అధికారులు నగరానికి చెందిన కెల్విన్‌ మాస్కెరాన్స్‌, అబ్దుల్‌ వహాబ్‌, అబ్దుల్‌ ఖుద్దూస్‌ను అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులకూ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడటంతో దర్యాప్తు చేపట్టి విచారణ కోసం సిట్‌ ఏర్పాటు చేశారు.

ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురిని విచారించారు. ఈ కేసులో 30 మందిని అరెస్టు చేసి, 27 మందిని విచారించారు. 12 కేసులకు గానూ ముందు 8 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేశారు. దర్యాప్తులో జాప్యంపై విమర్శలు వినిపించాయి. విచారణకు హాజరైన వారి నుంచి సేకరించిన నమూనాలు విశ్లేషించి నివేదికలను పొందుపరిచి అభియోగపత్రాలను దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. ఆమోదించడంతో త్వరలో న్యాయ విచారణ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Last Updated : Jul 1, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.