ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్‌గా నదీమ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఉర్ధూ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
గతంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘటన వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఉర్ధూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: