ETV Bharat / city

ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు - elections campaign 2021

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. నేటితో ప్రచారానికి తెరపడనుంది. నగరపాలక సంస్థల్లో ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్న అభ్యర్థులు.. ఆఖరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

elections campaign in Andhra Pradesh
హామీల వర్షం కురిపిస్తున్న అభ్యర్థులు
author img

By

Published : Mar 8, 2021, 7:23 AM IST

ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం

విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్నారు. రాజకీయాల్లో యువత అవసరాన్ని వివరిస్తూ.. తమని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామో చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 21 వ వార్డు అభ్యర్థికి మద్దతుగా తెలుగుదేశం నేత శ్రీ భరత్‌ ప్రచారం నిర్వహించారు. వైకాపా కూడా ప్రచార జోరు పెంచింది. ఉత్తర నియోజకవర్గ సమన్వయ కర్త కేకే రాజు డివిజన్లలో తిరుగుతూ ప్రచారం చేశారు. అభ్యర్థులూ విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార వైకాపా గెలిస్తే ఆస్తి పన్నును భారీగా పెంచుతుందని.... ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని సీపీఎం నేత మధు ఆరోపించారు. నగర ప్రజలు ఆలోచించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. 17వ వార్డులో జనసేన అభ్యర్థిని భాను శ్రీ బోగిల ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడిగారు. ఓట్లు గల్లంతయ్యాయంటూ విశాఖలో కొందరు ఆందోళనకు దిగారు. 32వ వార్డు పరిధిలోని అల్లిపురంలో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయని.... తెలుగుదేశం అభ్యర్థిని రాజ్యలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు.

జీవీఎంసీ ఎన్నికల కోసం వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి.... కోట్ల రూపాయల అక్రమ వసూళ్లు చేశారని తెలుగుదేశం సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ ఆరోపించారు. పదిరోజుల్లో 400కోట్ల రూపాయలను పారిశ్రామిక వేత్తలు, గుత్తేదారుల నుంచి బలవంతంగా వసూలు చేశారన్నారు.

వైకాపా అరాచక పాలనకు పురపాలక ఎన్నికల్లో గుంటూరు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో.... అధికార, విపక్షాలు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం అభ్యర్థుల తరఫున ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్‌ ప్రచారంలో పాల్గొన్నారు. పాత నగరంలో బహిరంగ సభ నిర్వహించిన వైకాపా నేతలు... తమ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఒంగోలు పురప్రచారంలో మంత్రి బాలినేని శ్రీనివారెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలుగుదేశం నేత దామచర్ల జనార్దన్‌ స్పష్టంచేశారు. తన ఆరోపణలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తే భయపడమని చెప్పారు.

పురపోరు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పోలింగ్‌ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావు తెలిపారు. అత్యంత సమస్యాత్మక , సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు చేసినట్లు తెలిపారు.

ఇదీచూడండి: ఎన్నికల వేళ.. ధర్మవరం డీఎస్పీ రాయితీల ప్రకటనపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.