ETV Bharat / city

తెలంగాణ: వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ - kammam district latest news

ముంబయిలోని అంబేడ్కర్ నివాసం.. రాజగృహపై దాడి చేసిన నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.

mrps president mandakrishna madiga demand for pd act file on ambedkar house attackers
తెలంగాణ: వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ
author img

By

Published : Jul 10, 2020, 5:05 PM IST

తెలంగాణ: వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ

అంబేడ్కర్ నివాసం రాజగృహపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాడ్​ చేస్తూ.. తెలంగాణలోని ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ ఆందోళనలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తించి వారిపై రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

దాడి సమయంలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్​.. నివాసంలోనే ఉన్నారని తెలిపారు. అంబేడ్కర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. నేటి నుంచి ఈనెల 18 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ శ్రేణులు భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా కేసులు..15 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.