MP Raghurama: ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు అనే విధానం మన దేశంలో కుదరదని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎవరూ పోటీ చేయకపోతే ఏకగ్రీవం చేసుకోవచ్చని.. శాశ్వత, జీవితకాల అధ్యక్షుడు అంటే కుదరదని స్పష్టం చేశారు. విజయమ్మ శుక్రవారం పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
YS Vijayamma Resignation: వైకాపా ప్లీనరీ వేదికగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా. షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా... సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి. -వై.ఎస్.విజయమ్మ
ఇవీ చూడండి: