ETV Bharat / city

విజయవాడలో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య - Mother and two children suicide

suicide
suicide
author img

By

Published : Jun 23, 2022, 8:41 PM IST

Updated : Jun 25, 2022, 5:10 PM IST

20:39 June 23

భర్త ప్రవర్తనతో విసిగి ఘాతుకం

మద్యం మహమ్మారి పచ్చని కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. తాజాగా మద్యానికి బానిసైన భర్త.. తనను, తమ పిల్లలను పట్టించుకోవటం లేదని ఓ మహిళ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పొలాలకు వేసే గుళికల మందు ఇద్దరు పిల్లలకు ఇచ్చిన తల్లి.. అనంతరం తానూ తీసుకుంది. లారీ డ్రైవర్​గా పని చేస్తున్న భర్త గోపాలకృష్ణ ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, ఇద్దరు పిల్లలు విగతజీవులై కనిపించారు. ఆత్మహత్య చేసుకునే ముందు లక్ష్మి సూసైడ్ లేఖ రాసింది. తన భర్త మద్యానికి బానిసై తనను, తన పిల్లలను పట్టించుకోవట్లేదని సూసైడ్ లేఖలో లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మధురానగర్​లో ఉన్న తల్లి ఇంటికి వెళ్లిన లక్ష్మి.. తిరిగి 2 గంటలకు ఇంటికి వచ్చిందని భర్త వెల్లడించారు.10 ఏళ్ల క్రితం లక్ష్మితో తనకు వివాహం అయ్యిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 25, 2022, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.