తెలంగాణ: నేడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన - హైదరబాద్‌లో వరదల ప్రభావం లెటెస్ట్ న్యూస్
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9:25 నిమిషాలకు తార్నాకలోని మణికేశ్వర్ నగర్‌లో పర్యటన ప్రారంభిస్తారు.
తెలంగాణ: నేడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల 25 నిమిషాలకు తార్నాకలోని మణికేశ్వర్ నగర్‌లో పర్యటన ప్రారంభిస్తారు. మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, మహ్మదీయ ఆసుపత్రి, కోమటికుంట, ఓల్డ్ ప్రేమ్‌నగర్, నరేంద్ర నగర్‌లోని వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ చెరువును పరిశీలించనున్నారు.