తెలంగాణలో ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రాకూడదని ఆ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ తర్వాతే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అత్యవసరమైతే పాస్‌లు ఉన్నవారే బయటకు రావాలని.. నకిలీ పాస్‌లతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే సరకు రవాణా వాహనాలకు అనుమతి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. ఏ పనైనా ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యే చేసుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: 'ఐడీ కార్డులు చూడకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పొద్దు'