సీఎం జగన్.. తన దోపిడీ కోసమే రాష్ట్రంలో కల్తీమద్యం, నాటుసారా విక్రయాలకు తెరలేపారని తెదేపా శాసనసభాపక్ష నేత డోలాబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. వైకాపా నేతలే ప్రభుత్వ అండదండలతో ఇతర రాష్ట్రాల మద్యం లేబుళ్లుమార్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. మద్యం సరిహద్దులు దాటివస్తున్నా.. ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు నిద్రావస్థ వీడటంలేదని ఆయన ఆరోపించారు.
జీతాలు పెంచాలని అడిగినందుకు ఎస్ఈబీలో 2,150మంది ఎస్పీవో అధికారులను జగన్ ప్రభుత్వం తొలగించిందని డోలాబాల మండిపడ్డారు. నాసిరకం మద్యం అమ్మకాలతో ఏటా రూ.6వేలకోట్ల వరకు ప్రజలనుంచి జగన్ రెడ్డి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి.. నిజంగా ప్రజలగురించి ఆలోచించేవారే అయితే.. తాను తీసుకొచ్చిన మద్యం పాలసీపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.