దసరా నాటికి చక్కెర ఫ్యాక్టరీలల్లోని ఉద్యోగుల జీతాలు చెల్లింపునకు(pay arrears of sugar industries employees) ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. చెరకు రైతుల బకాయిల చెల్లింపునకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చెరకు ఫ్యాక్టరీల సమస్యలపై వర్చువల్‌గా సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం.. వివిధ అంశాలను చర్చించింది. హైకోర్టు తీర్పుతో చెరకు రైతులకు మేలు జరిగిందని మంత్రి మేకపాటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్టోబర్ 5న నిర్వహించనున్న చక్కెర టెండర్ ప్రక్రియపై మంత్రి(group of ministers on ministers sugar industries) ఆరా తీశారు.
చెరకు రైతులు, చక్కెర ఫ్యాక్టరీ(sugar industries)ల ఉద్యోగుల జీతాల బకాయిలపై మంత్రి వర్గ ఉపసంఘం ప్రత్యేకంగా చర్చించింది. ఈ అంశాలపై సీఎంతో భేటీ అనంతరం మరోమారు సమావేశం కావాలని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. చక్కెర పరిశ్రమ డైరెక్టర్, కమిషనర్‌తోపాటు ఒ ఉన్నతాధికారిని నియమించి చక్కెర అమ్మకాలల్లో వేగం పెంచాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
ఈ ఏడాదికి గానూ చోడవరం, తాండవ సహా ఇతర చక్కెర కర్మాగారాలకు రూ.70 కోట్ల బకాయిలు ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీల బకాయిలు పెద్దమొత్తంలో ఉన్నాయన్నారు. చక్కెర ధర పెరిగిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అమ్మకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. బకాయిల్లో భాగంగా ఇప్పటికే రూ. 72 కోట్ల చెల్లించినట్టు అధికారులు మంత్రుల కమిటీకి వివరించారు. చక్కెర అమ్మకాలు, వీఆర్ఎస్ స్కీం అమలు సహా.. మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయాలు ఆర్థికశాఖతో ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు. చోడవరం ఫ్యాక్టరీతో పాటు ఇతర చక్కెర కర్మాగారా(sugar industries)ల్లో నిల్వ ఉన్న చక్కెరను విక్రయిస్తే రూ. 127 కోట్లు వచ్చే అవకాశముందని మంత్రుల కమిటీ అంచనా వేసింది.
ఇదీ చదవండి...
badvel by elections: ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలి: సీఎం జగన్