ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టంచేశారు. మాక్ టెస్ట్ వివరాలకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. పరీక్ష అనంతరం మరుసటి రోజు ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏయే అంశాలలో ఎక్కువ కృషి చేయాలనే వివరాలను తెలియజేస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని మంత్రి సురేష్ కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్: మంత్రి సురేశ్ - minister suresh latest news
విద్యార్థులకు ఉపయోగపడేలా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తోందన్నారు.