Minister Suresh on employees concern : రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులపై మంత్రి సురేశ్ మండిపడ్డారు. సీఎం జగన్తో సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీని అంగీకరించి.. మళ్లీ ఇప్పుడు ఆందోళనలు చేయటం సరికాదన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చన్నారు.
సెలవులు ఇచ్చే ఆలోచన లేదు..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. దాని తీవ్రత అంతగా లేదని మంత్రి సురేశ్ తెలిపారు. ఇప్పట్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదన్నారు. ఒకవేళ ఏదైనా పాఠశాలలో పిల్లలకు కరోనా సోకితే.. ఆ పాఠశాలను మూసివేసి శానిటైజ్ చేసిన తర్వాత ప్రారంభిస్తామని మంత్రి సురేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయని.. కోర్టు కూడా పరీక్షలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
ప్రభుత్వ జీవోలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి
EMPLOYEES PROTEST : ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం...నేడు కలెక్టరేట్ల ముట్టడి