రాష్ట్రంలో రూ.15 వేల కోట్లకుపైగా విలువైన 61 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభించడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన నిధులను విడుదల చేయించి.. కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తి చేయించినట్లు తెలిపారు.
కనకదుర్గ పైవంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మంత్రి శంకర నారాయణ, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభించడంపై స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు ఫ్లైఓవర్ కావాలన్న తమ చిరకాల కల నెరవేరిందని తెలిపారు.
ఇదీ చదవండి :