తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై... మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తనను లారీ డ్రైవర్ అనే దేవినేని ఉమ చరిత్ర అందరికీ తెలుసన్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ అంటూ తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని.. వాళ్లకు కోపం వస్తే.. ఆయన్ను ఏమైనా చేయొచ్చని అన్నారు. తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేకపోతే ఇక చెప్పబోమని... తామేంటో చేసి చూపిస్తామని నాని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సింహగిరిపై మరో కొత్త వివాదం... !