ETV Bharat / city

Kodali Nani : 'బెదిరింపులకు జగన్‌ భయపడరు' - minister kodali nani latest news

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఖండించారు. రాజశేఖర్‌రెడ్డిని రాష్ట్రానికి రక్షకుడిగా అభివర్ణించిన ఆయన.. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.

minister kodali nani fire on Telangana leaders
మంత్రి కొడాలి నాని
author img

By

Published : Jun 27, 2021, 8:23 PM IST

Updated : Jun 28, 2021, 4:54 AM IST

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం జగన్‌ వెనక్కి చూసే ప్రసక్తే లేదని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఉడత ఊపులు, బెదిరింపులకు భయపడి ఆయన వెనక్కి తిరిగి చూడరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వానికైనా సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకోవడానికి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాక్షసుడు అని కొందరు విమర్శిస్తున్నారు. ఆయన రక్షకుడు. బతికున్నంతకాలం రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యంగా ఉంచారు. రైతులు, పేదలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఇందిరమ్మ ఇళ్లు, రూ.లక్ష కోట్లతో నీటి ప్రాజెక్టులను చేపట్టారు. అనేక పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించారు. వైఎస్‌ బతికి ఉంటే ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు. మరణించిన వారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి’ అని హితవు పలికారు.

భాజపా ఎన్ని ఉద్యోగాలిచ్చింది..?

‘కేంద్రంలోని భాజపా ఎన్ని ఉద్యోగాలిచ్చిందో.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్కలు తీద్దాం. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చూడాలి. ఎవరు ఉద్యోగాలు కల్పించారో.. ఏ పార్టీ అధికారంలోకొచ్చాక ఉపాధి, ఉద్యోగాలు పోయాయో గణంకాలు వస్తాయి. తెదేపాను తొక్కేసి అధికారంలోకి రావాలని భాజపా నేతలు ఆతృతగా ఉన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు దీక్ష నిర్వహిస్తుంటే పోటీగా మేమూ ఉన్నాం అని చెప్పేందుకు ఆ పార్టీ ఏదో ఒకటి చేస్తోంది. రాష్ట్రంలో భాజపా గురించి పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారా..?’ అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి..

Flash: బీచ్​లో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతు.. ముగ్గురు మృతి

Last Updated : Jun 28, 2021, 4:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.