ETV Bharat / city

'కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు మాట్లాడటం హాస్యాస్పదం' - మంత్రి కన్నబాబు వార్తలు

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పథకాలు అమలు చేస్తుంటే.. ప్రతిపక్షాలు తమపై విమర్శలు గుప్పించటం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. కాపు, ఒంటరి, బలిజ మహిళలకు ఆర్థిక సాయం అందించిన ఘనత తమదే అన్నారు.

minister kannababu pressmeet kapu reservations
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
author img

By

Published : Jun 27, 2020, 1:29 PM IST

కాపు రిజర్వేషన్ల గురించి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే విచిత్రంగా అనిపిస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. కాపు, ఒంటరి, బలిజ మహిళలకు ఆర్థిక సాయం అందించామని... 2.3 లక్షల మంది మహిళలకు రూ.350 కోట్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. కాపు రిజర్వేషన్లపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అన్ని పథకాల ద్వారా రూ.4,700 కోట్లు ఆయా వర్గాలకు ఇచ్చామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఇంత చేస్తే పవన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. కుల ప్రస్తావన లేకుండా పవన్ మాట్లాడలేరా అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వానికి స్నేహితుడిగా ఉన్న పవన్... ముద్రగడను అణచివేస్తుంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.