కేంద్ర ప్రభుత్వం పాల ఉత్పత్తులపై వేస్తున్న జీఎస్‌టీని ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల సహకార కేంద్రాలు, డైయిరీ ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా డైయిరీ ఉత్పత్తులు, ఉత్పత్తి యంత్రాలపై కేరళ తరహాలో జీఎస్టీని రద్దు చేస్తూ.. తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దశాలవారీ ఆందోళనలు చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.
ఇవీ చూడండి