ETV Bharat / city

ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు... కౌన్సెలింగ్ ప్రక్రియలో లోపాలే కళాశాలలకు ఊతం!

రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బీ-కేటగిరీ సీట్లు భర్తీ కాకుండా బ్లాక్ చేసి, సీ-కేటగిరీ కిందికి మార్చుకునే ప్రయత్నాలు జరిగినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈమేరకు ఎన్​టీఆర్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

MBBS
MBBS
author img

By

Published : Apr 22, 2022, 5:53 AM IST

ఎంబీబీఎస్ ప్రవేశ ప్రక్రియలో అవకతవకలు... కౌన్సెలింగ్ ప్రక్రియలో లోపాలే కళాశాలలకు ఊతం!

ఎన్​టీఆర్ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన ఎంబీబీఎస్ బీ-కేటగిరీ కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయని... విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు కావాలనే సీట్లను బ్లాక్ చేయిస్తూ.... అర్హులైన విద్యార్థులకు దక్కకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో కళాశాల కనీసం 5 నుంచి 15 సీట్ల వరకు బ్లాక్ చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. విశ్వవిద్యాలయం నిర్వహించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియలో లోపాలే ప్రైవేటు వైద్య కళాశాలలకు ఊతమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. బీ-కేటగిరి సీట్ల కోసం మొదటి విడతలో నిర్వహించిన కౌన్సెలింగ్‌లోనే కొందరు విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. కానీ వాళ్లు చేరలేదు. మళ్లీ రెండో విడతలో వారికి అవకాశం కల్పించారు. రెండో విడతలోనూ కళాశాలల్లో చేరలేదు. అయినా మిగిలిన సీట్ల కోసం చివరిగా నిర్వహించిన మ్యాప్‌అప్‌ రౌండ్‌లోనూ మళ్లీ అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాప్‌అప్‌ రౌండ్‌లోనూ వారికి సీట్ల కేటాయింపు జరిగినా... మళ్లీ చేరకుండా వదిలేస్తారు. దీనివల్ల మ్యాప్‌అప్‌ రౌండ్‌ తర్వాత మిగిలిన సీట్లన్నీ సీ-కేటగిరిలోకి మారిపోతాయి. అందుకే కావాలని కొన్ని కన్సల్టెన్సీలతో మాట్లాడుకుని ఇలా ర్యాంకులు వచ్చి కూడా చేరని విద్యార్థులను గుర్తించి... వారితో సీట్లను బ్లాక్‌ చేయిస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి.

బీ-కేటగిరీలో సీటు వచ్చిన విద్యార్థులు ఏడాదికి 12 లక్షలు మాత్రమే ఫీజు చెల్లిస్తారు. అదే ఆ సీటును సీ-కేటగిరీకి మార్చుకుంటే నాలుగేళ్లకు కలిపి కోటి నుంచి కోటిన్నర వరకు అమ్ముకోవచ్చు. దీనికోసమే ప్రైవేట్ కళాశాలలు సీట్లను బ్లాక్‌ చేయించి సీ-కేటగిరీలోకి మార్చుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. బీ-కేటగిరీలో ఉన్న 800 సీట్లలో కనీసం వందకు పైగా బ్లాక్ చేసినట్లు అనుమానం ఉందంటున్నారు. వాస్తవంగా బీ-కేటగిరీలో సీట్లు మిగలడం అన్నదే జరగదు. ఎందుకంటే 12 లక్షల ఫీజు కట్టాలంటే మధ్యతరగతి వాళ్లు సైతం ప్రస్తుతం చేరిపోతున్నారు. అందుకే బీ-కేటగిరీలో మ్యాప్‌అప్‌ తర్వాత కూడా సీట్లు మిగిలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. అందుకే మరోసారి మ్యాప్‌అప్‌ రౌండ్‌ పెట్టి... ఇప్పటివరకూ సీట్లు వచ్చి చేరని వారందరినీ వదిలేసి... తర్వాత ర్యాంకులకు కేటాయించాలని కోరుతున్నారు. కానీ నిబంధనల ప్రకారం అలా కుదరదని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేస్తే విచారణ చేయాల్సిందిపోయి... చేతులెత్తేయడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి: MBBS Counselling: 'మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.