తెలుగు అకాడమీ పేరు మార్చడం విచారకరమని శాసనసభ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ (MANDALI BUDDA PRASAD) అన్నారు. అకాడమీ ఏర్పాటు చేసినా.. దానికి అవసరమైన ఏ పనులు పూర్తి చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కలపడం భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. కావాలంటే సంస్కృతానికి ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ తెలుగు అకాడమీ చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. తెలుగు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరించడం మంచిదికాదని మండలి బుద్ధ ప్రసాద్ హితవు పలికారు. మాతృభాషను గౌరవించుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యమన్న ఆయన.. సీఎం జగన్ (CM JAGAN) ఇప్పటికే తెలుగు మాధ్యమానికి మంగళం పాడడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి జగన్ తెలుగును అంతం చేయడానికే పుట్టినట్లు వ్యవహరించడం విచారకరమని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రావాల్సిన నిధులు తీసుకురాలేకపోవడాన్ని మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
BTECH RAVI 'రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న జగన్కు క్రికెట్ అవసరమా..?'