విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. ప్రయాణికులు, సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మస్కట్ నుంచి విజయవాడ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన లక్ష్మణరావుగా గుర్తించారు. మతిస్థిమితం లేకనే అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వెల్లడించారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా కుంగిన రోడ్డు- గుంతలో పడిన కారు