ఎలాగైతేనేం చంద్రబాబుగారి హయాంలో 9 లక్షల 56 వేల 263 ఉద్యోగాలు వచ్చాయన్న వాస్తవాన్ని ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం అంగీకరించింది. ఇదివరకు శాసనసభ సాక్షిగా పరిశ్రమల శాఖ ద్వారా 5 లక్షల 13 వేల 351 ఉద్యోగాలు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల ద్వారా 30 వేల 428 ఉద్యోగాలు వచ్చాయని వాళ్లే చెప్పారు. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2 లక్షల 78 వేల 586 ఉద్యోగాలు, మెగా ప్రాజెక్ట్స్ ద్వారా 1 లక్షల 33,898 ఉద్యోగాలు వస్తున్నాయని శ్వేత పత్రం ద్వారా బయటపెట్టారు. అంటే 'బాబు వచ్చారు...జాబు వచ్చింది' అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. మరి చంద్రబాబుగారి హయాంలో ఒక్క ఉద్యోగమూ రాలేదని అబద్ధమాడిన జగన్ గారు ప్రజలకు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారు?
-నారా లోకేశ్
ఇదీ చదవండి: తిరుమలలో అన్యమత ప్రకటనలా!