ETV Bharat / city

విషాదంలో ఉంటే విష ప్రచారానికి తెర లేపుతారా?: లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు

గ్యాస్ లీకేజ్ ప్రమాదంతో విశాఖ వాసులు విషాదంలో ఉంటే వైకాపా పేటీఎం బ్యాచ్​లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి తెరలేపాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. విశాఖ ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : May 7, 2020, 4:23 PM IST

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

గ్యాస్ లీకై విశాఖ వాసులు విషాదంలో ఉంటే వైకాపా నేతలు విష ప్రచారానికి తెర తీశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.వైకాపా పేటీఎం బ్యాచ్​లు కనీస మానవతాధృక్పథం లేకుండా సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని ట్విటర్ వేదికగా ఆగ్రహించారు. దొంగతనాలు, దోపిడీలు, విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వారికి మరోటి రాదని దుయ్యబట్టారు.

లోకేశ్ ట్వీట్
లోకేశ్ ట్వీట్

విశాఖ వాసులు ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రం, ఎన్డీఆర్​ఎఫ్ అన్ని చర్యలు తీసుకుంటాయని భరోసా ఇచ్చారు. పుకార్లను నమ్మవద్దని కోరారు. నిపుణుల సూచనలు పాటించాలని ప్రజలకు సూచించారు. పేటీఎం బ్యాచ్​ల తప్పుడు ప్రచారాన్ని విజ్జతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.