ETV Bharat / city

రంగురాళ్ల కోసం యథేచ్చగా తవ్వకాలు: నారా లోకేశ్

వైకాపా నేతలు ఇసుక, మట్టి నుంచి ఎర్రచందనం వరకు దోచుకుంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వైకాపా నేతలు వారి స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని..వారికి ఏదైనా జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు.

వైకాపా పై మండిపడ్డ నారాలోకేశ్
వైకాపా పై మండిపడ్డ నారాలోకేశ్
author img

By

Published : Apr 18, 2021, 10:21 PM IST

ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయచేస్తోంటే, వైకాపా నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ దుయ్యబట్టారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలంలో.. నర్సీపట్నం వైకాపా ఎమ్మెల్యే అనుచరులు అత్యంత విలువైన అలెగ్జాండరైట్ రంగురాళ్ల కోసం సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్ట్​లో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని మండిపడ్డారు.

అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరితెగింపో అర్ధమవుతోందని విమర్శించారు. క్రూరంగా.. వైకాపా నేతల స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్విస్తున్నారని, పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరని లోకేశ్​‌ ప్రశ్నించారు. ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారన్న లోకేశ్.. నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నారా లోకేశ్​‌ ట్విట్టర్​కు జత చేశారు.

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తోంటే... ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడింది.(1/3)@moefcc @prateepifs pic.twitter.com/Ar8UPeqq4m

    — Lokesh Nara (@naralokesh) April 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ఇంకా క్రూరంగా వైసీపీ నేతలు వాళ్ళ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్వి స్తున్నారు. ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాద్యులెవరు? ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం..ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?(3/3)

ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కొల్లు రవీంద్ర ఫైర్...

అక్రమ ఇసుక రవాణాతో వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నారని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. లోకేశ్​కు సవాల్ చేసే స్థాయి కాకాణికి లేదని మండిపడ్డారు. సర్వేపల్లికి గోవర్థన్ రెడ్డి రెండేళ్లలో చేసింది శూన్యమని దుయ్యబట్టారు. కరోనా కష్టకాలాన్ని కూడా సొమ్ము చేసుకున్న ఘనత కాకాణి గోవర్ధన్ రెడ్డిదేనని అన్నారు. వావిలేటిపాడులో 4.70 ఎకరాల దళితుల భూమి కబ్జాకు గురైతే.. చంద్రమోహన్ రెడ్డి పోరాడి దళితులకు దక్కేలా చేశారన్నారు.

ఇవీ చదవండి:

మధురవాడలో ఆ నలుగురి మరణం వెనుక కారణాలేంటి..?

'ఆంక్షల్లోనూ టీకా పంపిణీకి అంతరాయం కలగొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.