ETV Bharat / city

Lokesh attended court: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు: నారా లోకేశ్ - విజయవాడ కోర్టుకు హాజరైన నారా లోకేశ్

Lokesh attended court: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 2020లో అచ్చెన్న అరెస్టు సమయంలో.. లోకేశ్ అ.ని.శా. కోర్టు వద్దకు రాగా.. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన న్యాయస్థానానికి హాజరయ్యారు. తనపై ఇప్పటికే 14కేసులు పెట్టారని.. మరో 10కేసులు పెట్టుకున్నా ఏమి చేయలేరని అన్నారు.

Lokesh attended vijayawada court
నారా లోకేశ్
author img

By

Published : May 23, 2022, 12:28 PM IST

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు: నారా లోకేశ్

Lokesh attended court: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణలో భాగంగా.. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. 2020లో అచ్చెన్న అరెస్టు సమయంలో.. లోకేశ్ అ.ని.శా. కోర్టు వద్దకు వచ్చారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. అప్పట్లో లోకేశ్‌, కొల్లు రవీంద్ర, జాస్తి సాంబశివరావు , తెలుగు యువత దేవినేని చందుపై కేసు పెట్టారు.

ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు.. లోకేశ్‌తో పాటు కొల్లు రవీంద్ర హాజరయ్యారు. లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రహదారులు దిగ్బంధించి తెదేపా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపట్ల పార్టీ నేతల మండిపడ్డారు.

పార్టీ నేతల ఆగ్రహం.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ ఆనంతబాబుని పట్టుకోలేని పోలీసులు.. తమపై జులుం ప్రదర్శిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. అతి చేసే పోలీసులకు పరిణామాలు తప్పవని హెచ్చరించారు. జగన్ లా అవినీతి కేసుల్లో లోకేష్ కోర్టు మెట్లక్కలేదని తెలిపారు. గంజాయి దొంగలతో కుమ్మకైన పోలీసులు అమాయికుల్ని వేధిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా దుయ్యబట్టారు. వైకాపా కండువా వేసుకున్న పోలీసులు ఇబ్బందులు పడక తప్పదని స్పష్టం చేశారు.

వైకాపా ప్రభుత్వంపై నారా లోకేష్ ధ్వజం.. ఎన్నో కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానని తన పై అసత్య ఆరోపణలు చేసి.. చివరికి కొవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారన్నారు. ఇప్పటివరకు తనపై 14కేసులు పెట్టి ఏం సాధించారని నిరదీశారు. కావాలంటే మరో 10కేసులు పెట్టుకోండి అని అన్నారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే నేను కోర్టుకొచ్చా, సీఎంలా వాయిదాలు తీసుకోవట్లేదని మండిపడ్డారు.

ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారని అన్నారు. 2016 నుంచి నాపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమన్నారు. తన అవినీతి కేసులపై చర్చకు జగన్ సిద్ధమా అని నిలదీశారు.

సొంత పార్టీ కార్యకర్తలపైనే దాడులు.. తెదేపా నేతలతో పాటు దళిత ప్రజలపై.. వైకాపా దాడులకు తెగపడుతోందని లోకేష్ విమర్శించారు. తాజాగా సొంత కార్యకర్తలపైనే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఆనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. సొంత పార్టీ కార్యకర్తను కొట్టి చంపేసినా.. ఆ కుటుంబాన్ని కాపాడలేని పరిస్థితిల్లో జగన్ ఉన్నారన్నారు. 72గంటల్లో ఎమ్మెల్సీ ఆనంతబాబు సజ్జల సహా వైకాపా ముఖ్య నేతల్ని కలిశారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఆనంతబాబు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాడా అని ప్రశ్నించారు.

తాను కోర్టుకు వస్తే.. 500మంది పోలీసులు వచ్చారు. తన చుట్టూ తిరిగే పోలీసులు ఎమ్మెల్సీ ఆనంతబాబుని పట్టుకోండని సవాల్ చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.2కోట్లు, పొలం ఇస్తానని ప్రలోభ పెట్టారని ఆరోపించారు.

మంత్రులపై మండిపాటు.. పోలవరం పూర్తి చేస్తానంటూ సవాళ్లు చేసిన ఓ మంత్రి నేడు తనకు సంబంధం లేదంటున్నారని.. నారా లోకేష్ మండిపడ్డారు. జలవనరులపై అవగాహన లేని మరో వ్యక్తి ఇప్ప్పుడు మంత్రి అయ్యాడని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వైకాపా పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని ఎద్దేవా చేశారు. ఆదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్లారు అని ప్రశ్నించారు.

జగన్ రెడ్డి దేశం వదిలి వెళ్లాక పెట్రోల్ ధరలు తగ్గాయన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన ఒక్క పరిశ్రమ అయినా చెప్పగలరా అని నిలదీశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.