ETV Bharat / city

లారీ డ్రైవర్లకు లాక్​డౌన్ సడలింపు - లారీ డ్రైవర్లకు లాక్ డౌన్ సడలింపు

సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్లు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లినపుడు క్వారంటైన్​కు పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి నిరంతరం శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా ధరించటమని...ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలని సూచించింది.

Lockdown relaxation for lorry drivers
లారీ డ్రైవర్లకు లాక్ డౌన్ సడలింపు
author img

By

Published : May 16, 2020, 12:01 AM IST

సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్లు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లినపుడు క్వారంటైన్ కు పంపకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి కరోనా పరీక్షలు చేసి అనుమానిత లక్షణాలుంటేనే క్వారంటైన్ కు పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులతో రవాణాశాఖ ఆదేశించింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లగానే వారిని 14 రోజుల క్వారంటైన్​లో ఉండాలని స్థానిక అధికారులు పంపుతున్నారని.. దీనివల్ల డ్రైవర్లు విధులకు రాని పరిస్ధితి ఉంటుందని లారీ డ్రైవర్ల అసోషియేషన్ ప్రభుత్వానికి తెలిపింది. కీలకమైన నిత్యావసరాల పంపిణీకి ఆటంకం రాకూడదని భావించిన ప్రభుత్వం వీరి విన్నపాన్ని సానుకూలంగా పరిశీలించి ఈ మేరకు నిర్ణయించింది. డ్రైవర్లు, క్లీనర్లు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని చెబుతూ పాటించాల్సిన సూత్రాలను తెలిపింది. నిరంతరం శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించడం సహా ఇతర ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలని సూచించింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.