కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలోని శ్రీ కంచికామకోటి పీఠస్థ శ్రీ బాల పార్వతీ సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఆర్ష విజ్ఞాన పరిషత్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ గణపతి నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా అరుదైన లక్ష మోదక హవన సహిత గణపతి పూజలు, అష్టగణపతుల హోమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం ఈనెల 18 వరకు అత్యంత వైభవోపేతంగా జరుపుతామని ఆలయ వేద పండితులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా.. ఈ పూజ జరుగుతుందని అర్చకులు వెల్లడించారు. కొవిడ్ - 19 మహమ్మారి పూర్తిగా తొలగిపోవాలని, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని.. ఈ లక్ష మోదక హవన హోమాలు చేస్తున్నట్లు దేవస్థానం పాలకవర్గ సభ్యులు యడవల్లి నిలలోహిత శాస్త్రి వెల్లడించారు.
ఇదీ చదవండి..