ETV Bharat / city

Lady Fraud: మాయమాటలు చెప్పి లక్షల్లో దోచేసింది..! - Vijayawada News

భారీ మోసానికి పాల్పడిన కిలాడీ లేడీపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు కోటిన్నర విలువైన పొలం ఉందని, 80 లక్షల రూపాయల తాకట్టులో ఉందని చెప్పింది. ఆ భూమిని విడిపించేందుకు డబ్బులు కావాలని సెల్‌ఫోన్‌ షాపు యజమాని శివకృష్ణకు తెలిపింది. తాకట్టు నుంచి విడిపించిన తర్వాత స్థలం విక్రయించి డబ్బులు తిరిగి వస్తుందని శ్రీదివ్య చెప్పినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Lady Fraud
Lady Fraud
author img

By

Published : Jun 6, 2021, 6:16 PM IST

కన్సల్టెంట్‌ పేరిట భారీ మోసానికి పాల్పడిన కిలాడీ లేడీపై కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ రిపేర్ కోసం వచ్చిన శ్రీదివ్య అనే యువతి.. షాపు యజమానిని పరిచయం చేసుకుంది. రోజూ ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకుంది. తనకు కోటిన్నర విలువైన పొలం ఉందని, 80 లక్షల రూపాయల తాకట్టులో ఉందని చెప్పింది. ఆ భూమిని విడిపించేందుకు డబ్బులు కావాలని సెల్‌ఫోన్‌ షాపు యజమాని శివకృష్ణను తెలిపింది. తాకట్టు నుంచి విడిపించిన తర్వాత స్థలం విక్రయిస్తే డబ్బు తిరిగి వస్తుందని శ్రీదివ్య చెప్పినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. విడతల వారీగా 80 లక్షల రూపాయలు ఇచ్చానని వాపోయారు. సోదరుడితోపాటు రజాక్ అనే ఓ వ్యక్తితో కలిసి ఇదే తరహాలోనే మరికొంత మంది వద్ద డబ్బులు తీసుకుని శ్రీదివ్య మోసం చేసినట్లు వివరించారు. ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితురాలిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండీ... Somireddy vs Kakani సోమిరెడ్డి వర్సెస్ కాకాణి @ ఆనందయ్య మందు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.