చీప్ లిక్కర్, సారాకు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవేనని అన్నారు. సారాను బాటిలింగ్ చేసి వారుణి వాహిని పేరిట బ్రాండింగ్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీనేనని స్పష్టం చేశారు. లేనిపోని మద్యం బ్రాండ్లు తెచ్చిన చంద్రబాబు జే బ్రాండ్లు అంటూ వాటిని రద్దు చేయాలనటం విచిత్రంగా ఉందన్నారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వు, లెజెండ్ 999 అంటున్న బ్రాండ్లు గత ప్రభుత్వ హయాంలోనివేనన్నారు.
ఇదీచదవండి
ప్రభుత్వ లక్ష్యం అదే.. అందుకోసమే కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లు: తెదేపా