ETV Bharat / city

Kala Venkat Rao: రూ. 60 వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి: కళా వెంకట్రావు

author img

By

Published : Feb 18, 2022, 3:22 PM IST

Updated : Feb 18, 2022, 3:40 PM IST

రాష్ట్ర ప్రజలకు వాతలతో పాటు విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని తెదేపా సీనియర్ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ఇప్పటికే రూ.11 వేల కోట్ల పైచిలుకు విద్యుత్ ఛార్జీల వాతలు పెట్టారని మండిపడ్డారు. విద్యుత్ పేరుతో సమీకరించిన రూ.60 వేల కోట్లు ఏం చేశారో ? చెప్పాలని డిమాండ్ చేశారు.

రూ. 60 వేల కోట్లు ఏం చేశారో సమాధానం చెప్పాలి

ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిపడ్డారు. హిందూజా దగ్గర తక్కువ ధరకు విద్యుత్ లభిస్తోంటే, ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటని ఆయన నిలదీశారు. ఈ విద్యుత్ కొనుగోళ్ల వెనుకున్న రహస్యమేంటని ప్రశ్నించారు. గుట్టుచప్పుడు కాకుండా 3 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్న ఆయన, ప్రత్యేక కార్పొరేషన్ పేరుతో సేకరించిన రూ.60 వేల కోట్లను ఏం చేశారోనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై దాదాపు 6 లక్షల రూపాయల అప్పుల భారం ఉందని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండటం లేదన్న కళా.. వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని మండిపడ్డారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా 26 వేల కోట్లకుపైగా అప్పులు, ఛార్జీలు పెంచటం ద్వారా రూ.11 వేల కోట్ల రాబడి ప్రభుత్వానికి వస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నిధులను వినియోగించుకోవటం లేదని ఆరోపించారు. ఇన్ని డబ్బులు వచ్చినా విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని వెంకట్రావు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల ఖాతాల నుంచి తీసేసుకున్న రూ.23 వేల కోట్ల నిధులను ఏయే డిస్కంలకు ఏంతెంత ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరనిందలు మాని పనిచేసే విధానాన్ని జగన్ రెడ్డి నేర్చుకోవాలని కళా హితవు పలికారు.

ఇదీ చదవండి

CM Jagan: ఆత్మకూరులో కేంద్రీకృత వంటశాలను ప్రారంభించిన సీఎం

Last Updated : Feb 18, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.