వీలైనంత త్వరగా అందరికీ వాక్సిన్లు వేసేందుకు.. ప్రజా ప్రయోజనం కోసమే కోవాగ్జిన్ టెక్నాలజీ ఫార్ములాను ఇతర వాక్సిన్ తయారీ సంస్ధలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీని కోరారని.. ఆ పార్టీ స్పష్టం చేసింది. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే గొప్ప మనసుతో సీఎం... ప్రధానికి లేఖ రాస్తే తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆయన అనుకూలమైన వారంతా హైరానా పడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు.
ప్రజల ప్రాణాల కన్నా.. తమకు భారత్ బయోటెక్ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవరిస్తున్నారని అన్నారు. కోవాగ్జిన్ టెక్నాలజీ ఫార్ములాను వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం, అనుభవం ఉన్న మిగతా సంస్థలకు కూడా పంచి.. త్వరితగతిన అందరికీ వ్యాక్సిన్లు వేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు జోగి తెలిపారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయని ఆయన అన్నారు. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిచడం తగదన్నారు.
ఇవీ చదవండి:
'టీకాల ఉత్పత్తి పెంచాలని మార్చిలోనే చెప్పాం'
రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి