ETV Bharat / city

దొంగతనానికి గురైన జేసీ దివాకర్​ రెడ్డి నగదు దొరికాయి - జేసీ దివాకర్ రెడ్డి

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన రూ.6 లక్షలు చోరీకి గురయ్యాయి. పోలీసులు విచారణ చేపట్టగా ఆయన కారు డ్రైవరే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తెలిసింది.

జేసీ దివాకర్ రెడ్డి
author img

By

Published : Oct 13, 2019, 9:10 PM IST

Updated : Oct 14, 2019, 5:04 AM IST

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెందిన రూ.6 లక్షలు దొంగతనానికి గురై చివరికి దొరికాయి. ఆయన కారు డ్రైవర్ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దివాకర్ రెడ్డి ఈనెల 11న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడకు విమానంలో వచ్చారు. విమానాశ్రయం నుంచి కారులో నేరుగా గాంధీనగర్​లోని ఓ హోటల్​కి వెళ్లారు. తర్వాత సచివాలయానికి వెళ్లి 2.30కి తిరిగివచ్చారు. దివాకర్ రెడ్డి సూట్​కేసును కారు డ్రైవర్ గౌతమ్ తీసుకొచ్చి హోటల్​ గదిలో పెట్టి వెళ్లిపోయాడు. సాయంత్రం 6 గంటల సమయంలో జేసీ దాన్ని తెరవగా రూ. 6 లక్షలు కనిపించలేదు. వెంటనే ఆయన క్రైం డీసీపీ కోటేశ్వరరావుకు సమాచారమిచ్చారు. కారులో నుంచి ఆయన సూట్​కేసు తెచ్చిన పోరంకి వాసి, డ్రైవర్ గౌతమ్​ను పోలీసులు విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కారులో డ్రైవర్ సీటు కింద నగదు పెట్టినట్లు గౌతమ్ వెల్లడించాడు. సీపీఎస్ పోలీసులు కారును తనిఖీ చేయగా మొత్తం నగదు లభించింది. నగదును స్వాధీనం చేసుకుని డ్రైవర్​ గౌతమ్​ను ఆదివారం అరెస్టు చేశారు.

ఇదీ చదవండీ... రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలు..నవంబర్​ 1 నుంచి అమలు

Chandigarh, Oct 13 (ANI): Bharatiya Janata Party (BJP) national working president, JP Nadda along with Haryana Chief Minister ML Khattar released BJP's manifesto for the state. Addressing the public, Nadda said, "Modi ji said in Rewari that we will fulfill the demand of One Rank One Pension (OROP). I can say with authority, Rs 12,000 crore have been disbursed for OROP, 22 Lakhs cases have been addressed. There is no pending case of OROP."
Last Updated : Oct 14, 2019, 5:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.