ETV Bharat / city

భాజపా నిరసనకు.. జనసేన మద్దతు: నాదెండ్ల - బీజేపీ నిరసనకు జనసేన మద్దతు వార్తలు

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం ఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ గురువారం తలపెట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. భాజపా నాయకత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఈ అంశంపై చర్చించారని చెప్పారు.

janasena support to bjp agitation over antharvedhi chariot fire

author img

By

Published : Sep 9, 2020, 10:54 PM IST

అంతర్వేది ఘటనకు నిరసనగా.. గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు గంటపాటు ఎవరి ఇళ్లల్లో వారు నల్ల బ్యాడ్జిలు, నల్ల రిబ్బన్లతో నిరసన తెలపాలని జనసేన నేత మనోహర్‌ పిలుపునిచ్చారు. అంతర్వేది పుణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధమైన ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సరైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుందన్నారు.

ఈ ఘటనపై తక్షణం ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ పార్లమెంట్ సంయుక్త కమిటీల సమన్వయకర్తలు, సభ్యులతోనూ, అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఇన్​ఛార్జులను, నాయకులను, కార్యకర్తలను గృహ నిర్భందం చేయడాన్ని తప్పుపట్టారు. అరెస్టు చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.