మంత్రి అండతో వచ్చిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ కార్యనిర్వాహక అధికారికి ఆదాయం పైన దృష్టి ఉంటుంది కానీ... ఆచారాల మీద ఉంటుందా అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. ఈవో సురేశ్ బాబు ఆలయ పరిసరాల్లో బూట్లు వేసుకుని సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఫొటోను ట్విటర్లో ఉంచారు. సంచి మీద ఉన్న దృష్టి.. సంప్రదాయాల మీద ఉండదని విమర్శించారు. హైకోర్టు.. ఈవో అనర్హుడని ప్రకటించినా... ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచిందంటే అవినీతిలో మంత్రితో పాటు ముఖ్యమంత్రికి కూడా భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది మహేశ్ ట్విటర్లో విమర్శించారు.
ఇదీ చదవండి..