ఈనెల తొమ్మిదో తేదీన తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో దివీస్ ఫార్మా పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. దివీస్ ఫార్మా కంపెనీ ప్రాంతాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. తమ జీవితాలపై దివీస్ ఫార్మా పరిశ్రమ దుష్ప్రభావం చూపుతోందని.. ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు పలికేందుకు.. బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్ కల్యాణ్ తుని చేరుకొంటారు. అక్కడి నుంచి దివీస్ ల్యాబొరేటరీస్ కాలుష్యం వల్ల ఉపాధి కోల్పోయి... తీవ్ర ప్రభావానికి లోనయి.. దానవాయిపేట, కొత్తపాకలు పరిసర ప్రాంతాలకు వెళ్తారు. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికులను, పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడినవారిని పరామర్శించనున్నారు.
ఇదీ చదవండి:
సజ్జల, కొడాలి మధ్య వాటాల తేడాలతో బయటపడ్డ పేకాట శిబిరాలు: దేవినేని