పునరుత్పాదక ఇంధన కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి వెళ్లింది. ఈ నిర్ణయం దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉందంటూ ఆ శాఖ మంత్రి ఆర్కే సింగ్... ఈ విషయాన్ని అమిత్‌షాకు వివరించినట్లు తెలిసింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లకుండా కాపాడేందుకు ఆయన ఉన్నతస్థాయి రాజకీయ జోక్యం కోసమే విషయాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆ శాఖ కార్యదర్శితోపాటు తానూ ముఖ్యమంత్రికి లేఖ రాసినా పరిస్థితుల్లో మార్పురాలేదని ఆర్కే సింగ్ వివరించినట్టు సమాచారం. విద్యుత్ ధరలను పూర్తిగా స్వతంత్ర నియంత్రణ సంస్థలు నిర్ధారిస్తాయని, అందువల్ల పీపీఏలను భాగస్వామ్యపక్షాలన్నీ తప్పనిసరిగా గౌరవించాల్సిందేనని ఆయన జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖలోని అంశాలను అమిత్‌షాకు వివరించినట్లు తెలుస్తోంది.
హోంమంత్రి అమిత్‌షా దృష్టికి జగన్ నిర్ణయం! - ppa
తెదేపా హయాంలో కుదిరిన పీపీఏల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ... వాటిని పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హోంమంత్రి అమిత్‌షా దృష్టికి వెళ్లింది.